America vs China: ఏ యుద్ధానికైనా సిద్ధం 1 y ago
అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాటం చేయడానికి సిద్ధమే అని ప్రకటించింది చైనా. అగ్రరాజ్యంతో ఏ యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా టారిఫ్‌లకు ప్రతిగా తాము 10, 15 శాతం సుంకాలు విధిస్తామని తెలిపింది. సుంకాల పేరుతో ఒత్తిడి చేసి బ్లాక్ మెయిల్ చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి బెదిరింపులు, వ్యూహాలు తమపై ప్రభావం చూపవని చైనా పేర్కొంది.